శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపనున్నట్లు శ్రీకాళహస్తి ఆర్డిఓ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఇసుకను సొంత అవసరాలకు కాకుండా వ్యాపారావసరాలకు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం అర్ధరాత్రి తొట్టంబేడు మండలం పెన్నలపాడు రీచ్, ఏర్పేడు మండలం బండారుపల్లి రీచ్ లను తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.