బీజేపీ ప్రభుత్వం చేసిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. దిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. బీజేపీ రైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.