శ్రీకాళహస్తిలోని జడ్పీ పాఠశాలలో శుక్రవారం జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. అందులో 7వ తరగతి విద్యార్థి చరణ్ అనే ప్రత్యేక ప్రతిభావంతుడు శివుని అర్దిస్తూ వేసిన నాట్యం అతిథులను మంత్రముగ్ధులను చేసింది. అతని ప్రతిభకు మెచ్చిన ఎమ్మెల్యే తల్లి బొజ్జల బృందమ్మ రూ. 10వేల ఆర్థిక సాయం చేసింది. అంతేకాక విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు తానే అందజేస్తానని హామీ ఇచ్చారు.