భారతదేశంలోని మొదటి శివాలయంగా ప్రసిద్ధిగాంచిన గుడిమల్లం పరుశురామేశ్వరస్వామి ఆలయానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి బుధవారం కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి పరుశురామేశ్వరస్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి వారి సతీమణికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.