శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని 4 సచివాలయ కేంద్రాలలో 26వ తేది నుంచి 29వ వరకు స్పెషల్ ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేసినట్లు సోమవారం ఎంపీడీవో సురేంద్రనాథ్ తెలిపారు. డిజిటల్ సహాయకులను వెరిఫికేషన్ అధికారులుగా, సంబంధిత వెల్ఫేర్ సహాయకులను, మహిళా పోలీసులను సహాయకులుగా నియమించినట్లు తెలిపారు. పూడి, పిల్లమేడు, పొయ్య, చియ్యవరం, పెద్ద కన్నలి, తాటిపర్తి, రౌతు సురమాల గ్రామాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.