దొరవారి సత్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థుల భద్రత పట్ల తగిన తగిన చర్యలు తీసుకోవాలని సుళ్ళూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. దొరవారి సత్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులు నాయుడుతో కలిసి గురుకులంలో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు పాఠశాల ఆవరణ బయట తిరుగుతూ కనిపిస్తున్నారన్నారు. మరుగుదొడ్లను, వంట గదులు పరిశీలించారు.