నాయుడుపేట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు మంగళవారం ధర్నా చేపట్టారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది మున్సిపల్ కార్మికుల సొమ్ములను అన్యాయంగా తిన్నారని ఆరోపించారు.