తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని బిరదవాడలో మంగళవారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పెన్షన్లను పంపిణీ చేశారు. జనవరికి సంబంధించిన పెన్షన్ నగదును నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే పెన్షన్ లబ్దారులకు అందించడం జరిగిందని తెలిపారు. నెలవల సుబ్రహ్మణ్యం, విజయభాస్కర్ రెడ్డి, రఫీ, రాజేష్ కమిషనర్, ఎంపీడీఓ పాల్గొన్నారు.