ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి బాధ్యత తీసుకోవాలి: ఎమ్మెల్యే

80చూసినవారు
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి బాధ్యత తీసుకోవాలి: ఎమ్మెల్యే
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామం వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదివారం మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి బాధ్యతను తీసుకోవాలని ఆయన సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్