వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
By Sobhan 67చూసినవారుఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గం నుంచి టిడిపి నాయకులు విజయవాడకు నిత్యవసర సరుకులు తీసుకెళ్లారు. విజయవాడలో వచ్చిన వరదలకు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వారందరిని ఆదుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలు ఇవ్వడంతో టిడిపి నాయకులు నిత్యవసర సరుకులు తీసుకెళ్లారు. వాటిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం దగ్గరుండి బాధితులకు అందజేశారు.