ఉదయగిరి: పలువురు అధికారులు బాధ్యతలు స్వీకరణ
ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని పలువురు అధికారులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కావలి నూతన ఆర్డీవో గా వంశీకృష్ణ, కలిగిరి నూతన ఎంపీడీవో గా కే. ప్రత్యూష, సీతారాంపురం నూతన ఎంపీడీవో గా ఎం. భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రజల సమస్యలపై నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చును వారు సూచించారు. మండల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.