రాపూరు పంచాయతీ పరిధిలోని నవాబుపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పథకం పనులను నెల్లూరు జిల్లా డ్వామా పీడీ వెంకట్రావు బుధవారం ఆకస్మికoగా తనిఖీ చేశారు. అనంతరం కూలీలతో మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల నుంచి 10. 30 వరకు పని చేయాలని వేసవికాలం దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.