మహిళా రైతులు పెరటి తోటల సాగుపై దృష్టి సారించేలా కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు అవగాహన కల్పించాలని టీడీపీ నాయకురాలు కురుగొండ్ల లక్ష్మీసాయిప్రియ అన్నారు. ఆదివారం కృషి విజ్ఞాన కేంద్రంలో కూరగాయల సాగుపై నిర్వహించిన శిక్షణ తరగతులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఇంటి ఆవరణలో మహిళలు కూరగాయలు సాగు చేస్తుండే వారని, వాటితో ఇంటిల్లి పాదికీ అవే సరిపోయేవన్నారు.