బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వెంకటగిరి పట్టణంతో పాటు పట్టణ పరిసర ప్రాంతాలు కాంపాలెం, బంగారుపేట, పాలకేంద్రం తదితర ప్రాంతాలలో మంగళవారం ఉదయం నుంచే మోస్తరు వర్షం కురుస్తూ ఉంది. ఆకాశంలో మేఘాలు నల్లగా కమ్ముకుని ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. చలి గాలులు వీస్తూ ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.