ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి భూమన అభినయ్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మహిళలకు ఉచిత బస్ హామీ కోసం బుధవారం ఆర్టీసీ బస్సులో ఎక్కి నిరసన తెలియజేశారు. అయితే ఈ నిరసనరకు సంబంధించి బస్సు కండక్టర్ అలిపిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు నేడు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.