వయసుతో సంబంధం లేకుండా ఇటీవల గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. ఉత్తర్‌ప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లా సిరౌలి గ్రామంలో శుక్రవారం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మోహిత్ చౌదరి (14) అనే బాలుడు గుండె పోటుతో మణించాడు. క్రీడల్లో భాగంగా పాఠశాలలో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.