AP: హోలీ పండుగ వేళ రాష్ట్రంలో వేర్వేరు చోట్లా వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. అన్నమయ్య జిల్లాలో రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మరణించారు. కురబలకోట మండలం తానామిట్ట సమీపంలోని అడవిపల్లె వద్ద ఈ ఘటన జరిగింది. లారీల్లోనే ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీశారు. అలాగే కృష్ణా జిల్లా ఘంటసాల మండలం జీలగలగండి వద్ద మినీ ట్రక్కు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.