AP: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని గిరిజనులు డోలీలో ఆస్పత్రికి తరలించారు. విశాఖ జిల్లా దేవరపల్లి మండలం బొడిగరువు గ్రామానికి చెందిన గర్భిణి సాహూ శ్రావణికి సోమవారం పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. గ్రామానికి రహదారి లేనందున బంధువులు, గ్రామస్తులు ఆమెను డోలీలో వాగు దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా స్పందించి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరారు.