ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మైనర్లు మృతి

56చూసినవారు
ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మైనర్లు మృతి
AP: పండుగ పూట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం సెలవు కావడంతో బైక్ తీసుకుని లిఖిత్(11) సంతోష్(16) సరదాగా బయటకు వెళ్లారు.  ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్