యూపీలోని మీరట్‌లో పోలీసులు ఓ గ్యాంగ్‌స్టర్‌ను ఎన్ కౌంటర్ చేశారు. జితేంద్ర అనే గ్యాంగ్‌స్టర్‌ను ఎస్టీఎఫ్ పోలీసులు కాల్చి చంపారు. ఇతను 2016లో హరియణాలో ఇద్దరిని హతమార్చాడు. ఆ కేసులో జైలు శిక్ష పడింది. అయితే 2023లో పెరోల్‌పై బయటికి వచ్చిన అతను పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇతను లారెన్స్ బిష్ణోయ్ గ్రూపుతో కూడా సంబంధం కలిగి ఉండడంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి హతమార్చారు.