ఏపీలో ఆగని ఫ్లెక్సీ వార్

1089చూసినవారు
ఏపీలో ఆగని ఫ్లెక్సీ వార్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తోంది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాటలు ముదిరి ఇప్పుడు ఫ్లెక్సీల వార్‌కి దారి తీసింది. తాజాగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్టపై ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను కర్రలతో కొడుతూ నాశనం చేశారు. వైసీపీ కార్యకర్తలే ఈ పని చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్