ఏపీలో కురిసిన అకాల వర్షాలకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విద్యుదాఘాతంతో సీనియర్ లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్ మృతి చెందిన విషాద ఘటన బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో చోటుచేసుకుంది. ఈపూరులో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి వర్షానికి దెబ్బతిన్న విద్యుత్ తీగలను సరిచేసే క్రమంలో ఘటన ఇద్దరు ఉద్యోగులు మరణించిన ట్లు పోలీసులు వెల్లడించారు.