మణిపూర్‌లోని సేనాపతి జిల్లా చాంగోబంగ్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీఎస్ఎఫ్ జవాన్లతో వెళ్తున్న వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో 13 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.