VIDEO: వరదలు.. గర్భీణులు తీవ్ర అవస్థలు

61చూసినవారు
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో గర్భిణులు ఆసుపత్రికి వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. జీకే వీధి మండలం మొండిగడ్డకు చెందిన శాంతి అనే గర్భిణిని తాళ్ల సాయంతో అంబులెన్స్ ఎక్కించి చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. రంపచోడవరం మండలం చెరువు నిమ్మలపాలెంలో నెలలు నిండిన గర్భిణీని గిరిజనులు ట్రాక్టర్‌ ఎక్కించి వాగు దాటించారు. పెద్దబయలు మండలం డెట్రాయిట్‌పుట్టలో మరో గర్భిణి పుష్ప సాయం కోసం ఎదురుచూస్తుంది.

సంబంధిత పోస్ట్