స్ఫూర్తిదాయకం శ్యామల సాహసయాత్ర
గోలి శ్యామల సాహసయాత్ర స్ఫూర్తిదాయకం. ఆమె 52 ఏళ్ల వయసులో సముద్రంలో ఈది రికార్డు సాధించారు. గత నెల 28న విశాఖ సముద్రతీరం నుంచి కాకినాడ తీరం వరకు కోరమండల్ ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో సాహసయాత్ర ప్రారంభించారు. సముద్రంలో రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కి.మీ. ఈది శుక్రవారం సూర్యారావుపేట తీరానికి చేరుకున్నారు. 2021లో రామసేతు, గత ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో ఈది ఆసియాకు చెందిన మొదటి వ్యక్తిగా నిలిచారు.