ఆపదలో అండగా సీఎం సహాయ నిధి - ఎమ్మెల్యే శంబంగి

67చూసినవారు
ఆపదలో అండగా సీఎం సహాయ నిధి - ఎమ్మెల్యే శంబంగి
పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఆపదలో అండగా ఉంటుందని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో పలు ఆరోగ్య సమస్యలుతో బాధపడుతున్న పలువురు బాధితులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఆయన మంగళవారం అందజేశారు. బొబ్బిలి నియోజకవర్గంలో 5 మంది లబ్ధిదారులకు గాను 10లక్షల10వేల రూపాయలు మంజూరు కాగా ఆ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్