బొబ్బిలి కోటలో ఘనంగా గురజాడ జయంతి వేడుకలు

75చూసినవారు
బొబ్బిలి కోటలో ఘనంగా గురజాడ జయంతి వేడుకలు
గురజాడ అప్పారావు 162 వ జయంతిని పురస్కరించుకొని బొబ్బిలి కోటలో గురజాడ జయంతి వేడుకలను ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి మహాకవి గురజాడ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ గురజాడ అడుగుజాడల్లో నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్