రాజచెరువువలసలో బాలవికాసకేంద్రం పునఃప్రారంభం

51చూసినవారు
రాజచెరువువలసలో బాలవికాసకేంద్రం పునఃప్రారంభం
బొబ్బిలి (మ) దిబ్బగుడ్డివలస పంచాయతీ రాజచెరువువలసలో టిటిడి, సమరసతసేవా ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్మించిన దేవాలయంలో ఆదివారం వ్యాసభగవానుడు ఉద్భవించిన గురుపౌర్ణమి శుభసందర్భంగా బాలవికాసకేంద్రం పునఃప్రారంభం జరిగింది. పిల్లలకు చదువు సంస్కారం ఆటలు ఆధారంగా పంచాయతీ గ్రామపెద్దలు వి. సత్యనారాయణ, యం. పీ. టీ. సి వి. నాగరాజు, మండలకన్వీనర్ జి. జనార్ధనరావు, సహకన్వీనర్ బి. గణపతి, ఆచార్యుడు, అర్. పాపారావు, ఆలయ అర్చకులు వెంకటరమణ సంస్థయొక్క ధర్మప్రచారకులు ధూపంవాసు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్