ఇటీవల సైబర్ నేరగాళ్లు అనేక విధాలుగా దోపిడీలు చేస్తున్నారని, అట్టి వారి ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు సూచించారు. స్థానిక ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో భూసాయవలస, ముచ్చర్లవలస గ్రామాల్లో చట్ట నియమావళి పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి చట్ట పరిధిలో నడుచుకోవాలన్నారు. మహిళలలపై అనుచిత వ్యాఖ్యలు, వికృత చేష్టలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.