చీపురుపల్లి మండలంలో స్థానికం గా ఉన్న విజ్ఞాన్ పాఠశాలలో శుక్రవారం యోగా డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ యోగా వలన మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఆయాసం, గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టడంలో యోగా ఉపయోగపడుతుందని తెలిపారు. 2015నుండి ప్రతి ఏటా జూన్ 21 న యోగా డే జరుపుకొంటామని తెలిపారుఈ కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.