గరివిడి మండలం, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రకృతి వ్యవసాయ కూరగాయల స్టాల్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ బాలి సత్యనారాయణ మరియు కుప్ప నాగమణి కార్యాలయ సిబ్బందికి స్థానిక సిబ్బందికి వెలుగు ఏపీఎం, సీసీలకు ప్రకృతి వ్యవసాయ పైన అవగాహన కల్పించడం జరిగింది. సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి ప్రక్కన ఖాళీ స్థలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు పండించుకుని తినాలని తెలిపారు.