విజయనగరం జిల్లా మెరకముడిదాం గర్భాం గ్రామం లో పంచముఖి ఆంజనేయ కాలనిలో యువ గణేష్ సేవ సంఘ సభ్యులు ఉదార స్వభావంతో వర్షాలకు నిరాశ్రయులైన తాళ్లాభక్తుల శ్రీను ఇంటిని పునర్ నిర్మించేందుకు నిర్ణయించుకున్నారు. ప్రదీప్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల భాగంలో లక్ష రూపాయలు పౌరాణిక నాటికను వేయించేందుకు ఏర్పాటు చేసుకోగా ఆ డబ్బుతో శ్రీను ఇంటిని నిర్మించేందుకు నిర్ణయించారు. వీరి ఉదార స్వభావానికి మెచ్చి గ్రామ ప్రజలు కూడా సహాయాన్ని అందిస్తున్నారు.