విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం లో ఉన్న మెంటాడ మండలం జక్కువ గ్రామంలో గురువారం సాయంత్రం కిరాణా షాపులో మద్యాన్ని విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆండ్ర ఎస్సై సీతారాం తెలిపారు.పట్టుబడిన వ్యక్తి నుండి 38 180 ఎం.ఎల్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని,అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్ఐ సీతారాం వెల్లడించారు.