గజపతినగరం మండలం పాత బగ్గాo అంగన్వాడి 2 కేంద్రంలో ప్రాజెక్ట్ అధికారిని నాగమణి ఆదేశాలు మేరకు శుక్రవారం ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ కనకదుర్గ మాట్లాడుతూ. శిశువుకి ఆరు నెలల వయసు వచ్చేవరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని, తద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడని అవగాహన కల్పించారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాలు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.