HPCL ఆధ్వర్యంలో నడుపుతున్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, బొల్లినేని మెడ్ స్కిల్స్ సంయుక్తంగా బ్యూటీషియన్, హోటల్ మేనేజ్మెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్), ప్రొడక్షన్ మిషన్ ఆపరేటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ కోర్సులు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సెకండ్ ఫ్లోర్ లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ నందు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కోర్సులు చేసేందుకు ఇంటర్, డిప్లొమా,ఐటీఐ,పదో తరగతి పూర్తి చేసి 18 నుంచి 28 ఏళ్లలోపు గల విద్యార్థిని విద్యార్థులు అర్హులన్నారు. ఈ మూడు నెలలు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ,ఉచిత యూనిఫామ్, బుక్స్, ఎస్సీ క్యాంపస్ వంటి సదుపాయం కల్పిస్తున్నామన్నారు. శిక్షణ పూర్తయిన వెంటనే ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులకు బీఎస్సీ, డిప్లొమా పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి గల వారు వివరాలకు తమ సంస్థ నందు లేదా 7993011695, 9121999654 నంబర్లను సంప్రదించాలని కోరారు.