అంగరంగా వైభవంగా పైడితల్లి సిరిమాను చెట్టు తరలింపు

50చూసినవారు
విజయనగరం పైడితల్లి సిరిమాను చెట్టు తరలింపు ప్రక్రియ అంగరంగా వైభవంగా ప్రారంభమైంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అవసరమైన వృక్షాన్ని  డెంకాడ మండలం పెద్ద తాడివాడ గ్రామంలో గుర్తించారు. శనివారం సిరిమాను వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం. పూజారి వెంకట్రావు, చెట్టు కొట్టి తరలించే ప్రక్రియను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఎమ్మెల్యేలు లోకం మాధవి, అదితి గజపతి రాజు, పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్