సాలూరు: భక్తులతో రద్దీగా మారిన సాలూరు దేవాలయాలు
సాలూరు మండల పరిధిలో పలు హిందూ దేవాలయాలు మంగళవారం వేకువజాము నుంచి భక్తులతో రద్దీగా మారాయి. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం కావడంతో పలువురు భక్తులు వెంకటేశ్వర స్వామి, శ్రీ పంచముఖేశ్వర ఆలయం, శ్రీ సత్యనారాయణ స్వామి తదితర దేవాలయాలను సందర్శించి ప్రత్యేక దీపారాధన నిర్వహించారు. నారికేళ ఫలాలను నైవేద్యాలుగా సమర్పించి గోత్రనామాలతో పూజలు నిర్వహించారు.