కైలాంలో మలేరియా వ్యతిరేక మహోత్సవం

59చూసినవారు
మెంటాడ మండలం కైలాం గ్రామంలో శనివారం చల్లపేట ప్రాథమిక వైద్య అధికారి డాక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మహోత్సవం ర్యాలీ జరిగింది. దోమలు కుట్టకుండా, దోమ తెరలు వాడాలని, నీరు నిల్వ లేకుండా, పరిసరాల పరిశుభ్రత చూసుకోవాలని గ్రామస్తులను కోరుతూ నినాదాలు చేశారు. డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ ఇళ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. దోమకాటు తో జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరావు, హెచ్ వి రవణమ్మ, ఎమ్మెల్ హెచ్ పి లు, ఆశా కార్యకర్తలు, సతివాడ రాజేశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్