నిత్యం మద్యం తాగి వచ్చి మాతో అమానుషంగా ప్రవర్తిస్తున్న హాస్టల్ వార్డెన్ పై చర్యలు చేపట్టాలని కొత్తవలస బీసీ హాస్టల్ బాలికలు సోమవారం వార్డెన్ నీరజా కుమారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వార్డెన్ తాగి వచ్చి మమ్మల్ని కొడుతోందని, పారిశుద్ధ్య పనులు తమతో చేయిస్తోందని ఆవేదన చెందారు. పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ నైట్ స్టడీస్ నిర్వహించకుండా హేళన చేస్తోందని అన్నారు. వార్డెన్ పై చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరారు.