వరద బాధితులకు విరాళం అందించిన యువకులు

77చూసినవారు
వరద బాధితులకు విరాళం అందించిన యువకులు
ఎస్ కోట మండలం కొట్టాం కు చెందిన కొంతమంది యువకులు తమ ఉదార భావాన్ని చాటుకున్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం గ్రామంలో సేకరించిన రూ. 40 వేల చెక్కును శనివారం జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ కు ఆయన కార్యాలయంలో అందజేశారు. ఈ నేపథ్యంలో గొరపల్లి ఈశ్వరరావు, వేచలపు మహేష్, గుర్రపు శ్రీనివాసరావు, తగరంపూడి సన్యాసిరావు లకు గ్రామస్తులు తమ అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్