విజయనగరం పట్డణంలో స్దానిక శ్రీనివాస జూనియర్ కాలేజిలో.. మంగళవారం జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సంఘం ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయ వ్యవస్థ బలోపేతానికి ఎంతోమంది కృషి చేసారని వారి కృషి ఫలితంగానే గ్రంథాలయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. గ్రంథాలయాల ద్వారా విజ్ఞానంతో పాటు ఉన్నత విలువలు అలవడతాయని అన్నారు.