ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన ఆదేశాలు రక్తదాన శిబిరం నిర్వహించారు. బొబ్బిలి కోటలో బడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు శిభిరాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ సినీ రంగానికి, ప్రజా సేవకు అంకితమైన కారణజన్ముడని కొనియాడారు. నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన దీక్షదక్షుడన్నారు. రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. మున్సిపల్ ఫ్లోర్ లీడర్, పట్టణ అధ్యక్షుడు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గున్నారు.