బొబ్బిలి పట్టణంలోని భోజరాజపురం వద్దనున్న ప్రధాన నీటి సరఫరా కేంద్రాన్ని పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.జ్యోతి బుధవారం పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న ప్యానల్ బోర్డులతో పాటు, వైరింగ్లను మార్చాలని ఆదేశించారు. తాగునీటి పైపులైన్ల లీకులను అరికట్టాలని సూచించారు. నిర్దేశిత పరిణామాలతో తాగునీటి క్లోరినేషన్ జరగాలన్నారు.