మండలంలోని రాజచెరువువలస గిరిజన గ్రామంలో శుక్రవారం వనమిత్ర కృష్ణ దాసు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను గ్రామస్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి, మట్టి వినాయక విగ్రహాలతో పూజించాలని కృష్ణదాస్ అన్నారు. మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్య్రమంలో ఆలయ అర్చకులు ఎం వెంకటరమణ,మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.