బొబ్బిలిలో బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోగా నడుచుకుంటూ వచ్చేవారు సైతం కనపడటం లేదు. ఇదిలా ఉంటే పొగమంచుతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండగా వాకర్స్ పొగమంచు పూర్తిగా కప్పేసిందని, దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుందంటున్నారు. వాతావరణం పూర్తిగా చల్లబడగా తీవ్రమైన చలితో చలిమంటలను ఆశ్రయిస్తున్నారు