బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో సోమవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముం నాయుడుతో కలసి ప్రభుత్వం 100 రోజులు పాలన పూర్తి చేసుకున్న ప్రగతిని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సాయి శక్తులకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.