చీపురుపల్లి డివిజన్ పరిధిలో గుర్ల మండలం జమ్మపేట యూనిట్ గరిడ గ్రామం మహాలక్ష్మి వివోలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం మాస్టర్ ట్రైనర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు. ఈ షాపు వద్ద రైతులకు పురుగుమందులు తెగుళ్ళకు కావలసిన అన్ని రకాల కషాయాలు ద్రావణాలు అందుబాటులో ఉంటాయని వెంకటలక్ష్మి రైతులకు వివరించారు.