చీపురుపల్లికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మొబైల్ లైబ్రరీ రూపకర్త రెడ్డి రమణ ఆదివారం కన్నుమూశారు. ఈయన ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి విజయనగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈయన మొబైల్ బైక్ లైబ్రరీ ద్వారా అనేక మంది విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అవగాహన కల్పించారు. ఈయన మృతి పట్ల పలువురు విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.