ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర సమగ్ర శిక్షణ అమరావతి వారి ఆధ్వర్యంలో.. సోమవారం నుండి రెండు రోజులు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లకు 'ఎస్.ఎమ్.సి' విధులు,బాధ్యతలు అనే అంశంపై శిక్షణ కార్యక్రమము నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమానికి చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాల ఎస్.ఎమ్.సి చైర్మన్ గవిడి సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో చీపురుపల్లి విద్యా డివిజన్ గల ఎస్.ఎమ్.సి సభ్యులుకు,టీచర్లుకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.