చీపురుపల్లి: రిపోర్ట్ తయారీకి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం

81చూసినవారు
చీపురుపల్లి: రిపోర్ట్ తయారీకి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం
గుర్ల మండలంలో ఇటీవల డయేరియాతో పలువురు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరణాలపై విశ్లేషణ రిపోర్టు తయారు చేసేందుకు ప్రభుత్వం ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ పద్మలీల శుక్రవారం తెలిపారు. ఈ టీంలో ముగ్గురు వైద్యులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారని, గుర్ల లో పర్యటించి మూడు రోజుల్లో మరణాలకు గల కారణాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్